Transgender Doctor Prachi Rathod Insprational Story : 'ప్రజలకు వైద్యసేవ చేయడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది' - transgender prachi rathod insprational story
Published : Sep 8, 2023, 7:06 PM IST
Transgender Doctor Prachi Rathod Insprational Story : తానో ట్రాన్స్‌జెండర్.. సమాజమే కాదు.. కుటుంబం కూడా తనను అర్థం చేసుకోలేదు. ఇంట్లోంచి బయటకు వచ్చి నానాకష్టాలు అనుభవించింది. ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ, గేలి చేసే వారి ముందు ఇంకా హేళనైపోతాననుకుంది. తనను తాను అర్థం చేసుకుని కష్టపడి ఆదిలాబాద్ రిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పట్టా సాధించింది. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రిలో ఏఆర్‌టీ విభాగంలో డాక్టర్‌గా వైద్య సేవలందించే స్థాయికి ఎదిగింది ప్రాచీ రాఠోడ్ (Transgender Doctor Prachi Rathod).
మరీ ప్రాచీ రాఠోడ్ ఈ స్థాయికి ఎలా ఎదిగింది. ప్రజలకు వైద్యసేవ చేయడం చాలా గర్వంగా, ఆనందంగా ఉందని చెబుతోంది. చిన్నప్పటి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. లింగ వివక్షత వల్లే గతంలో ఉద్యోగం కోల్పోయానని తెలిపింది. వివక్ష లేని సమాజం కావాలంటుంది. ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో యాంటీ రెట్రో వైరల్ డిపార్ట్‌మెంట్‌లో వైద్య సేవలందిస్తోంది. రోగులు ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఆమె చెబుతోంది. ప్రాచీ రాఠోడ్ ఎన్ని కష్టాలు ఎదుర్కొంది. తన మనోగతం ఏంటి..? తన మాటల్లోనే విందాం.