తెలంగాణ

telangana

Train Accident In Bihar Lohit Express divided into two parts in Katihar

ETV Bharat / videos

తప్పిన భారీ ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్​ప్రెస్​ రైలు.. చివరకు.. - Lohit Express divided into two parts in Katihar

By

Published : Jun 21, 2023, 7:17 AM IST

బిహార్​లోని కతిహార్ జిల్లాలో​ ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోహిత్​ ఎక్స్​ప్రెస్ రైలు​ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాల మీద నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బంగాల్​లోని నార్త్​ దినాజ్​పుర్​ జిల్లాలోని ఉన్న దల్ఖోలా స్టేషన్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది?
మంగళవారం లోహిత్​ ఎక్స్​ప్రెస్​ రైలు.. గువాహటి నుంచి జమ్ము తపాయికి బయలుదేరింది. దల్ఖోలా స్టేషన్​ సమయంలో రైలు.. ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఇంజిన్​ నుంచి సుమారు పది బోగీలు విడిపోయాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

కోచ్​ నుంచి బోగీలు విడిపోయాక.. అనేక మంది ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, దల్ఖోలా స్టేషన్ మాస్టర్​ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్​కు జతచేసి.. రైలు ప్రారంభించారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 

ఒడిశాలోని బాలేశ్వర్​లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత కూడా రైల్వే అధికారుల్లో చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతను అధికారులు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బాలేశ్వర్​లో మూడు రైళ్ల ఘోర ప్రమాదంలో 291 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details