ట్రాఫిక్ పోలీసుపైకి దూసుకెళ్లిన కారు బానెట్‌పైనే లాక్కెళ్లి - ట్రాఫిక్ పోలీసుపై దూసుకెళ్లిన కారు న్యూస్
మధ్యప్రదేశ్ ఇందోర్ సమీపంలో లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్ పోలీసులు వేగంగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కారు డ్రైవర్ రెడ్ లైట్ పడినా కారును ఆపకుండా పోలీసు పైకి దూసుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ కారు బానెట్‌పై పడిపోయాడు. అయినాసరే కారును ఆపకుండా డ్రైవర్ చాలా దూరం వరకు పోలీసును లాక్కొని వెళ్లాడు. ఈ ఘటన అంతా కూడలిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఫుటేజీ ఆధారంగా కారు డ్రైవర్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కారును సోదా చేయగా ఓ తుపాకీ కూడా లభ్యమయింది. దానిపై కూడా ఆరా తీస్తూ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST