తెలంగాణ

telangana

Traffic Jam Near LB Stadium Hyderabad

ETV Bharat / videos

సీఎం ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్ - ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ - ఎల్బీ నగర్​లో ట్రాఫిక్ సమస్య

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 5:03 PM IST

Traffic Jam Near LB Stadium Hyderabad :ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో అంక్షలు విధించడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్​ను నియంత్రించడంలో పోలీసులు చేతులెత్తేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడటానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోజూ ఆఫీస్​లకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. మరోవైపు సీఎం ప్రమాణ స్వీకారం కారణంగా ముఖ్యలు, సెలబ్రిటీలు రావడంతో వారికి బందోబస్తు నిర్వహించే క్రమంలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్​కు మరింత అంతరాయం ఏర్పడింది. కార్యక్రమం ముగిసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్​ను పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details