మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా - ఆరుగురికి త్రీవ గాయాలు - ఆసిఫాబాద్లో ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురి గాయాలు
Published : Dec 2, 2023, 6:40 PM IST
Tractor overturned at Komaram Bheem Asifabad : రోజువారి కూలీలతో ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో చోటు చేసుకుంది. గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిర్యాణి మండలం గుండాల గ్రామానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కూలీ పని చేసుకోవడానికి ట్రాక్టర్లో బయల్దేరారు. ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
Few women were injured due to an Accident : దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. వాహనం బోల్తాపడిన విషయం తెలుసుకున్న సమీప గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 108కి సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిర్యాణి మండలంలోని ఆసుపత్రికి తరలించారు.