TPCC Chief Revanth Reddy Chandiyagam : కొడంగల్‌లో రేవంత్ రెడ్డి చండీయాగం.. కుటుంబసమేతంగా పూజలు - revanth reddy in chandiyagam at kodangal
Published : Sep 29, 2023, 5:38 PM IST
TPCC Chief Revanth Reddy Performs Chandiyagam at Kodangal : కొడంగల్‌లోని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా చండీయాగం జరుగుతోంది. ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా చండీయాగంలో పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమానికి స్థానిక పార్టీ లీడర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణలో ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కొడంగల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి తెలిపారు. చండీయాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్దించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణకు మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్న రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ చండీయాగం రాజకీయంగా కూడా నేతల్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి దైవ సంకల్పం కోసమే ఈ యాగం చేశారని స్థానిక నేతలు అంటున్నారు.