భారీ వర్షాలు.. సరస్సులో 26 మంది టూరిస్ట్‌లు.. టెన్షన్ టెన్షన్! - వరదల్లో చిక్కుకున్న పర్యటకులు
Tourists Stuck In Kareri Lake : హిమాచల్ ప్రదేశ్.. కాంగ్డా జిల్లాలోని కరేరీ సరస్సులో చిక్కుకున్న 26 మంది పర్యటకులను పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. అనంతరం వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. అసలేం జరిగిందంటే?
కాంగ్డా జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు ధాటికి నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం 26 మంది పర్యటకులు కరేరీ సరస్సుకు వెళ్లారు. ఆ సరస్సు ఒక్కసారిగా పొంగిపొర్లడం వల్ల వాళ్లందరూ వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. 26 మంది పర్యటకులను రక్షించి ఆదివారం అర్ధరాత్రి సురక్షిత ప్రాంతాలకు పంపించారు పోలీసులు.
'భారీ వర్షాల కారణంగా కరేరీ సరస్సులో చిక్కుకున్న 26 మంది పర్యటకులను రక్షించాం. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాం. ఆదివారం సాయంత్రం కూడా కొంత మందిని రక్షించాం' అని కాంగ్డా ఎస్పీ షాలిని అగ్నిహోత్రి తెలిపారు.
Sikkim Floods 2023 : మరోవైపు.. సిక్కింలో కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల రహదారులు మూసుకుపోయాయి. స్థానికులు, పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిక్కిం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా.. అవసరమైన చోట్ల హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.