Tomato Distribution Hyderabad : రిచ్ డాడీ.. కూతురి బర్త్ డే రోజు 4 క్వింటాళ్ల టమాటాలు ఫ్రీగా పంచేశాడు - కూతురు పుట్టిన రోజున తండ్రి ఉచితంగా టమాట పంపిణీ
Tomatoes Distribution Hyderabad on Daughter's Birthday : ఎక్కడైనా పుట్టిన రోజు వేడుకలు జరిగితే అన్నదానం చేస్తారు. చిన్నపిల్లల పుట్టిన రోజైతే డిఫరెంట్‌గా బొమ్మలు, పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు పంచుతుంటారు. కొంతమంది అనాథాశ్రమానికి వెళ్లి వారితో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కాస్త వెరైటీగా ట్రై చేశాడు. తన కూతురు పుట్టిన రోజున ఏకంగా ఏం పంపిణీ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ తన కూతురు పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. పుట్టినరోజు అన్నదానం, పండ్ల పంపిణీ కాకుండా.. టమాటాలను పంపిణీ చేశారు. భారీగా పెరిగిపోయిన టమాట ధరల పెంపునకు పేదలు పడుతున్న ఇబ్బందిని గుర్తించారు శివ. దీన్ని దృష్టిలో పెట్టుకుని బుధవారం రోజున 400 కిలోల టమాటాలను కొనుగోలు చేసి బస్తీవాసులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆకాశాన్నంటిన టమాటాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న బస్తీవాసులు బారులుతీరారు.