తెలంగాణ

telangana

టమాటాలకు ఇద్దరు 'బౌన్సర్ల' సెక్యూరిటీ.. కనీసం ముట్టుకున్నా ఊరుకోరు!

By

Published : Jul 9, 2023, 4:29 PM IST

tomato security bouncers

Tomato Security Bouncers : దేశంలో ఇప్పుడు టమాటా ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది! ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చే. కొన్ని ప్రాంతాల్లో టమాటా ధర డబుల్​ సెంచరీని కూడా దాటింది. ఇటీవలే కర్ణాటకలోని టమాటాల దుకాణంలో సీసీ కెమెరా పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వ్యక్తి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మరో వ్యాపారి ఇంకొక అడుగు ముందుకేశాడు. తన కూరగాయల దుకాణానికి ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాడు.

Tomato Rate India : టమాటాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరు ప్రజలు టమాటాలను దొంగలిస్తున్నారని.. అందుకే బాడీగార్డులను పెట్టుకున్నానని వ్యాపారి అజయ్​ ఫౌజీ చెబుతున్నాడు. ఇప్పుడు ఉన్న అన్ని కూరగాయల్లో టమాటా ధర బాగా పెరిగిపోయిందని.. ప్రజలు రేటు తగ్గించమని అడుగుతున్నారని అజయ్​ అన్నాడు. కానీ నాకు వచ్చే లాభం బట్టే అమ్ముతున్నానని తెలిపాడు.

"టమాటాలను కొనేందుకు వచ్చిన వారు.. కొందరు ధర తగ్గించమని గొడవపడుతున్నారు. మరికొందరు టమాటాలను దొంగలిస్తున్నారు. అందుకే బౌన్సర్‌లను పెట్టుకున్నాను. ప్రస్తుతం కిలో టమాటా రూ. 160కు అమ్ముతున్నాను. ప్రజలు కేవలం 50 లేదా 100 గ్రాముల టమాటాలే కొంటున్నారు."

- అజయ్​ ఫౌజీ, టమాటాల వ్యాపారి

ఖరీదు అని చెప్పు ముట్టుకోనివ్వడం లేదు..
Tomato Price In India : "టమాటాలు చాలా ఖరీదు అని చెప్పి ముట్టుకోనివ్వడం లేదు. 250 గ్రాముల టమాటాలను రూ. 35 పెట్టి కొన్నాను. కుటుంబంలో 10 మంది ఉన్నప్పుడు తక్కువ టమాటాలతో ఏం చేయగలం? కానీ తప్పదు" అంటూ కొనుగోలుదారుడు విజయ్ కుమార్ యాదవ్ వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details