తెలంగాణ

telangana

Present Tomato prices in Hyderabad

ETV Bharat / videos

Tomato Price Hyderabad Today : హమ్మయ్య.. దిగొచ్చావా టమాటా.. అయితే టేస్ట్ చేయాల్సిందే..! - Tomato price Hyderabad Today

By

Published : Aug 9, 2023, 9:21 AM IST

Updated : Aug 9, 2023, 11:36 AM IST

Tomato Price Hyderabad Today : మొన్నటిదాకా సామాన్య ప్రజలను హడలెత్తించిన టమాటా ధర.. తన పంథాను మార్చుకొని మెల్లమెల్లగా దిగొస్తోంది. గత రెండు నెలలుగా టమాటా రుచికి దూరమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు.. ఇప్పుడిప్పుడే వండుకొని తినడం మొదలుపెట్టారు. గత వారం రోజుల క్రితం బహిరంగ మార్కెట్​లో డబుల్ సెంచరీతో రూ.200 కిలో ఉన్న టమాటా... ఇప్పుడు రైతు బజార్​లో రూ.100లోపే లభిస్తోంది. చాలా కాలంగా టమాటాకు దూరమైన భోజన ప్రియులు ఇష్టంగా తెచ్చుకొని మరీ కూరల్లో వేస్తున్నారు. 

Tomato Price Dropping Hyderabad : హైదరాబాద్ మెహిదీపట్నం రైతుబజార్‌లో సోమవారం కిలో టమాటా రూ.63లకే లభించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అలాగే గుడిమల్కాపూర్‌ మార్కెట్‌రోడ్డులో కిలో టమాటా(గోటి) రూ.50లకు వస్తోందని వినియోగదారులు అంటున్నారు. బయట మార్కెట్​లు, రోడ్లపై ఆటోలో తీసుకొచ్చిన మొదటి రకం టమాటా రూ.90 కిలో నిర్ణయించి వర్తకులు అమ్ముతున్నారు. 

ఈ నెల చివరి నాటికి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యాపారస్థులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మొన్నటి వరకు సామాన్యుడుకి అందని ద్రాక్షలా మిగిలిన టమాటా.. ఇప్పుడు ధరలు కాస్త తగ్గడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఇన్ని రోజులుగా మిస్ అయిన టమాటా స్పెషల్స్​ వండుకొని తింటున్నారు.

Last Updated : Aug 9, 2023, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details