Prathidwani : తెలంగాణకు హరితహారం.. ఈ మహా క్రతువును భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లనున్నారు? - ఈరోజు ప్రతిధ్వని
Published : Aug 25, 2023, 9:49 PM IST
Prathidwani : అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోస్తూ.. జీవ వైవిద్యానికి బలమైన పునాదులు వేస్తూ.. ఆకు పచ్చ తెలంగాణకు బాటలు వేస్తున్న కార్యక్రమం "హరితహారం". ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 2015లో పురుడు పోసుకున్న ఈ హరిత యజ్ఞం.. విస్తృత ప్రజాభాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది. 2015 నుంచి ఇప్పటి దాకా రూ.11,095 కోట్ల వ్యయంతో.. రాష్ట్రవ్యాప్తంగా 288.48 కోట్ల మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచంలో చేపట్టిన పెద్ద మానవ ప్రయత్నాల్లో మూడోదిగా హరితహారం గుర్తింపు సంపాదించింది. అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాల చుట్టూ 10,980 కిలోమీటర్లు పొడవు కందకాలు తవ్వారు. తెలంగాణకు హరితహారంతో 2015 నుంచి ఇప్పటి దాకా దాదాపు 8 శాతం గ్రీన్ కవర్ పెరిగింది. అటవీ పునరుద్ధరణ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తుంది. ఇందులో భాగంగానే మరోసారి భారీ సంఖ్యలో 1.25 కోట్ల మొక్కలు నాటేందుకు సర్కార్ సన్నద్ధమైంది. మరి 8 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ హరితహారం ఇప్పటి వరకు సాధించిన విజయాలేంటి..? నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? ఈ హరిత క్రతువును భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు..? ఈ అంశాలపైనే నేటి ప్రతిధ్వని.