Prathidwani : కొండల్లా పెరిగిపోతున్న ఘన వ్యర్థాలు.. పురపాలనను చక్కదిద్దేది ఎలా ? - గుట్టల్లా పేరుకుపోతున్న వ్యర్థాలు
Prathidwani on Sanitation Challenges : దేశంలో ఘన వ్యర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ అదే సమయంలో గాడి తప్పిన పట్టణీకరణ, పెరుగుతున్న వినియోగ సంస్కృతి నగరాల్లో చెత్త కొండలను సృష్టిస్తోంది. ఇందుకు రాష్ట్రం కూడా మినహాయింపు ఏమీ కాదు. పారిశుద్ధ్య నిర్వహణలో అత్యంత కీలకమైన వ్యర్థాలు, మురుగునీటికి సంబంధించి ఎన్నో సవాళ్లు. ఇప్పటికే జాతీయ హరిత ట్రైబ్యునల్ అక్షింతలు వేసే వరకు వెళ్లిందంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అయినా ఇప్పటి కూడా రాష్ట్రంలోని 130 పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు దస్త్రాలను దాటడం లేదు. వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోతే అటు పర్యావరణం... ఇటు ప్రజారోగ్యానికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? ఈ విషయంలో అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ? ఈ పారిశుద్ధ్యం, వ్యర్థాలనిర్వహణలో ప్రభుత్వంతో పాటు ప్రజల పాత్ర ఏమిటి? ఆ విషయంలో పౌర భాగస్వామ్యాన్ని పెంచడానికి ఏం చేయాలి ? పురపాలనను చక్కదిద్దేది ఎలా ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.