Prathidwani : రాష్ట్రంలో దగ్గర పడుతున్న ఎన్నికల సమయం.. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో లోటుపాట్లంటూ అభ్యంతరాలు - ఓటర్ల జాబితా
Published : Sep 5, 2023, 10:57 PM IST
Prathidwani Debate on Telangana Voter List 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఈ సంవత్సరం ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ముసాయిదా జాబితాలను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
Telangana Assembly Elections 2023 :ఓటర్లు తమ పేర్లను జాబితాలో సరిచూసుకోవడంతో పాటు మార్పులు, చేర్పులు అవసరమైతే దరఖాస్తులు తీసుకోవాలని చెప్పారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు విషయాల్లో ఈఆర్ఓలు న్యాయపరమైన, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో వేగంగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో లోటుపాట్లంటూ అభ్యంతరాలు.. స్వచ్ఛ ఓటర్ల జాబితా కోసం ఈసీ ముందున్న కర్తవ‌్యమేంటి? జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 4.61 లక్షల ఓట్లలో పొరపాట్లు.. రాష్ట్రం మొత్తం ఓటర్ల జాబితా దిద్దుబాటుకు ఏం చేయాలి? ఓటరు జాబితాల్ని సరిచేయడంలో పౌరభాగస్వామ్యం ఎలా? మార్పులు, చేర్పులపై ప్రజల్లో ఎలాంటి అవగాహన అవసరం? ఏ వివరాల మార్పులకు ఏ ఏ దరఖాస్తులు సమర్పించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.