Prathidwani : ఎన్నికల అఫిడవిట్లు.. అభ్యర్థులపై వేట్లు - Minister Srinivas Goud
Prathidwani : ‘‘ప్రజాస్వామ్యం.. రాజ్యాంగ ముఖ్య లక్షణం. ఓటు హక్కుకు పూర్తి చట్టబద్ధత ఉంది. ప్రతి ఓటరుకూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పూర్తి నేపథ్యం తెలుసుకొనే హక్కు ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ.. అపీల్ చేసిన మెదక్ ఎంపీ బీబీ పాటీల్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటనలు నేతలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎన్నికల అఫిడవిట్లు పిడుగుపాట్లుగా మారాయి. ఎన్నికల అఫిడవిట్లలో సరైన సమాచారం చెప్పకపోతే అసలుకే మోసం వస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎంపిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తరహా కేసులున్న ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమీషన్ నిబంధనల్ని అభ్యర్థులంతా పాటిస్తున్నారా? అన్న సందేహం తలెత్తుతోంది. లోపం ఎన్నికల సంఘానిదా? రాజకీయ పార్టీలదా?. రాష్ట్ర హైకోర్టులో మరో 28 మంది ప్రజాప్రతినిధుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ ఏ పరిస్థితుల్లో కోర్టులు అటువంటి తీర్పునిస్తాయి.. ఈ అంశంపై నేటి ప్రతిధ్వని