తెలంగాణ

telangana

Challenges to Fulfilling Election Promises

ETV Bharat / videos

గెలిచిన పార్టీకి హామీల అమలు కత్తిమీద సామే - అవసరాలకు తగిన రీతిలో ఆర్థిక రథాన్ని నడిపించడమెలా? - తెలంగాణ ఎన్నికల ఫలితాలు

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 10:55 PM IST

Challenges to Fulfilling Election Promises :రాష్ట్రంలో ప్రధాన ఘట్టానికి తెరపడింది. గురువారం రోజు ఎన్నికల క్రతువు పూర్తయింది. గడచిన ఆరునెలలుగా నెలకొన్న ఎన్నికల హడావిడికి ముగింపు పలికనట్లయింది. పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. డిసెంబర్ 3న వెలువడనున్న ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. ప్రధాన పార్టీలన్నీ ఎవరికీ వారుగా, తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Election Manifesto Issues : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆకాశమే హద్దుగా హామీలను గుప్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల జల్లు కురిపించారు. ఏ ఒక్క పార్టీ అని గాకుండా ప్రధాన పార్టీలన్నీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి ఇచ్చిన హామీలను అమలు చేయడం కత్తిమీద సామే అని చెప్పొచ్చు. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఆర్థిక వనరులు సరిపోవు. మరి ఇటువంటి సమయంలో సంక్షేమం - అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇవ్వడమే సవాల్‌ నెలకొంది. అవసరాలకు తగిన రీతిలో ఆర్థిక రథాన్ని నడిపించడమెలా? ఇదే నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details