Prathidwani : ఎన్నికల బరి.. బీసీలపై పార్టీల గురి - bjp
Prathidwani : తెలంగాణ రాజకీయాల్లో బలంగా బీసీవాదం తెరపైకి వస్తోంది. రాజకీయ ముఖచిత్రంలో.. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కొత్తలెక్కలు తెరపైకి వస్తున్నాయి. కొన్నిరోజులుగా కీలకంగా మారిన బీసీవాదం.. అందులో ప్రధానాంశంగానే చెప్పొచ్చు. అందుకు తగినట్లే.. ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక సమీకరణాలపై కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ బీసీమంత్రం జపం చేస్తున్నాయి. ఈ రేసులో బీసీవాదంపై ఏ పార్టీ విధానం ఏమిటి? జనాన్ని ఆకట్టుకునేందుకు.. సమాజంలో అధికంగా ఉన్న వెనుబడివర్గాలకు గాలం వేసేందుకు పోటీపడుతున్నాయి. సామాజిక సమీకరణాలపై మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లో స్పష్టంగా ఈ చర్చ కనిపిస్తోంది. సంక్షేమపథకాలకు బీఆర్ఎస్ పదును పెడుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ రేసులో ఎవరు ఎక్కడ? బీసీవాదంపై ఏ పార్టీ విధానం ఏమిటి? రాష్ట్ర రాజకీయాలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.