Pratidwani: తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మరో 2 కొత్తసంస్థలు.. డ్రగ్స్, సైబర్‌నేరాలకు చెక్! - ETV bharat debate on drugs cybercrime check
Pratidwani: తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మరో 2 కొత్తసంస్థల్ని ఏర్పాటు చేసింది... రాష్ట్ర ప్రభుత్వం. సైబర్, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో - టీఎస్‌ఎన్‌ఏబీ, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో- టీఎస్‌సీఎస్‌బీలను ప్రత్యేకంగా కొలువుదీర్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఈ బ్యూరోలను బుధవారమే లాంఛనంగా ప్రారంభించారు.ఈ బ్యూరోల కోసం దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ ఎకో సిస్టమ్‌ను సురక్షితం చేసేందుకు టీఎస్‌సీఎస్‌బీని అందుబాటులోకి తెచ్చారు. మరి.. సైబర్, మాదకద్రవ్యాల నేరాల నియంత్రణలో ఈ బ్యూరోల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలేంటి? వీటిని ఏర్పాటు అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? కొత్త వ్యవస్థలకు కావాల్సిన మద్దతు ఏమిటి? అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇకనైనా డ్రగ్స్ ముట్టడికి అడ్డుకట్ట పడుతుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.