Prathidwani : సాగురంగంలో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్
Prathidwani Debate On Monsoon Crops : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రధాన పంటగా ఉన్న వరి సాగు పంటకాలాన్ని ముందుకు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో చేతికొచ్చే పంట నష్టపోతుందని, వానాకాలం పంట నెల ముందుకు జరపాలని మంత్రి హరీశ్‌రావు రైతులకు హితవు పలికారు. గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ లేకపోతే.. తెలంగాణ రాకపోతే.. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా ఫించన్లు ఉండేవి కాదన్నారు. అలాగే రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. అకాల వర్షాలు, వడగళ్ల వానల బారి నుంచి అన్నదాతలను కాపాడేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా... తెలంగాణలో సీజన్ల వారీగా పంట కాలాన్ని దాదాపు నెల ముందుకు జరపడమే పరిష్కారమని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనిపై రైతులను చైతన్య పరచడంతో పాటు పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తీర్మానించింది. మరి... ఇలా పంటల సీజన్ ముందుకు జరపడంతో మేలు ఎంత? అందుకు కావాల్సిన సన్నద్ధత ఏమిటి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.