Prathidwani: ఇంటర్ బోర్డు కొత్త మార్గదర్శకాలు.. కాలేజీలు ఏ మేరకు అమలు చేయగలవు? - నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని
Prathidwani: ఒత్తిళ్ల పొత్తిళ్లలో నలిగి పోతున్న ఇంటర్ విద్యార్థులు! ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాల్లో మరీ ఇబ్బందికరంగా మారుతోందీ పరిస్థితి? ఏటా నమోదవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలే సమస్య తీవ్రతకు నిదర్శనం కూడా. ఇరుకు భవనాల్లోనే చాలా ఇంటర్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. అలాంటి చోట విద్యార్థులకు ఆటలు, మానసిక ఉల్లాసం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే... విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, సంస్కరణల దిశగా రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు.
అయితే వీటిని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేటు కాలేజీలు ఏ మేరకు అమలు చేయగలవు? వీటిని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వీటిలో కొత్త ప్రతిపాదనలు ఏంటి? జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ పరిస్థితేంటి? గతంలోనే ఉన్న మార్గదర్శకాలు ఏంటి? వీటిని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వీటితో అత్యంత కీలకంగా మారిన జూనియర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ పరిస్థితి ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.