తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani ఏడుకొండల వాడా తిరుమల కొండపై ఉండేదెలా - తిరుమలలో అధికారుల బాదుడు

By

Published : Jan 12, 2023, 9:36 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

Prathidwani: కలియుగ ప్రత్యక్షదైవం ఆ ఏడుకొండలవాడు కొలువైన తిరుమల అంటే గుర్తుకు రావాల్సింది... ఆధాత్మిక సౌరభాలు, చేతులెత్తి నమస్కరించుకోవాలనే భక్తిభావం. కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయాలు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది తీసుకున్న దర్శన సేవల టికెట్ ధరల పెంపు ప్రతిపాదనల నుంచి... ప్రస్తుతం కొనసాగుతున్న కొండపై గదుల అద్దె పెంపు వివాదం వరకు.. కోటిమొక్కులతో కొండకు వస్తున్నవారిని ముప్పుపెడుతున్నాయని వాపోతున్నారు శ్రీవారి భక్తులు. అసలు తితిదే పెద్దల వైఖరి ఎందుకింత వివాదాస్పదం అవుతోంది? పరిష్కారాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details