రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న పేపర్ లీకేజీలు.. లోపాలకు మూలం ?
Prathidwani : ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశం ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అంశంతో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ఇవాళ పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ అలజడి నెలకొంది. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ఇంతటి కీలకమైన పరీక్షల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది. అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి ? పగడ్బందీగా జరగాల్సిన పరీక్షల్లో లోపాలకు మూలం ? ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కీలకమైన పది పరీక్షల నిర్వహణలో ఎందుకీ ఆపసోపాలు ఎదురవుతున్నాయి. లీకేజీ ఘటనలపై గత అనుభవాలు ఏం చెబుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎలాంటి మార్పులు అవసరం ? రాజకీయాలకతీతంగా విద్యార్థులను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేటి ప్రతిధ్వని.