తెలంగాణ

telangana

Tirumala_Srivari_Navaratri_Brahmotsavam_2023

ETV Bharat / videos

Tirumala Srivari Navaratri Brahmotsavam 2023: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..హనుమంత వాహన సేవలో భక్తులకు అభయమిచ్చిన మలయప్పస్వామి - Srivari Navratri Brahmotsavam News

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 1:58 PM IST

Updated : Oct 20, 2023, 2:30 PM IST

Tirumala Srivari Navaratri Brahmotsavam 2023 :తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ( టీటీడీ) అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ (Hanumantha Vahana Seva In Tirumala) నిర్వహించారు. తిరుమల మాడ వీధుల్లో హనుమంత వాహనంపై మలయప్పస్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. 

నేటి షెడ్యూల్ :సాయంత్రం నాలుగు గంటలకు అత్యంత విశేషమైన పుష్పక విమాన సేవ,  రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనసేవ జరగనుంది. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. పుష్పక విమానంపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు. మలయప్ప స్వామివారు గజ వాహనంపై విహరించనున్నారు. కాగా, గురువారం సాయంత్రం శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఈ నెల 23వ తేదీన శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నాన మహోత్సవం జరగనుంది.

Last Updated : Oct 20, 2023, 2:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details