పెట్రోల్ బంక్‌లో నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి వెళ్లిన టిప్పర్- కూలీ మృతి - కర్ణాటక పెట్రోల్ బంక్‌లో ప్రమాదం
Published : Nov 25, 2023, 11:23 AM IST
Tipper Ran Over Sleeping Person In Udupi :పెట్రోల్ బంక్ ఆవరణలో నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి టిప్పర్ వెళ్లగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక ఉడుపిలో జరిగిందీ ఈ ప్రమాదం.
ఇదీ ప్రమాదం..
ఉడుపి పట్టణంలోని సోమేశ్వర్ పెట్రోల్ బంక్ ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున శివరాజ్, మరో వ్యక్తి పడుకున్నారు. ఆ సమయంలో పెట్రోల్ బంక్‌కు ఓ టిప్పర్ వచ్చింది. ఇద్దరు కూలీలు బంక్ ఆవరణలో నిద్రిస్తున్నారని టిప్పర్ డ్రైవర్ గమనించలేదు. ట్యాంక్‌లో డీజిల్ నింపుకుని బయటకు వెళ్లేటప్పుడు శివరాజ్‌పై నుంచి టిప్పర్‌ను నడిపాడు. ఈ క్రమంలో శివరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే అప్రమత్తమై.. పెట్రోల్ బంక్ సిబ్బందికి విషయం చెప్పాడు. అందరూ కలిసి శివరాజ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు శివరాజ్‌ను.. షిమోగాలోని కొర్లికొప్పా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.