తెలంగాణ

telangana

three feet bride marriage in up

ETV Bharat / videos

ఒక్కటైన మరుగుజ్జు జంట.. అంగరంగ వైభవంగా పెళ్లి - మరుగుజ్జు ఇమ్రాన్​ పెళ్లి వీడియో

By

Published : Feb 13, 2023, 10:46 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మరుగుజ్జు జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అలీగఢ్​ జిల్లాలోని జీవన్​గఢ్​ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఇమ్రాన్​ ఏడుగురు తోబుట్టువుల్లో చిన్నవాడు. ఇమ్రాన్​ పొడవు కేవలం 3 అడుగుల 4 అంగుళాలే. దీంతో ఇమ్రాన్​కు తగ్గ వధువు దొరకడం కష్టంగా మారింది. ఇమ్రాన్​ హాటల్​లో పనిచేస్తూ.. తన తల్లి బిర్జిస్​తో కలిసి ఉంటున్నాడు. ఇమ్రాన్​కు తగ్గ వధువు కోసం కుటుంబసభ్యులు వెతికే పనిలో ఉండగా..​ తల్లి బిర్జిస్​కు పట్వారీ నాగ్లాలోని భగవాన్​గడి ప్రాంతానికి చెందిన 3 అడుగుల పొడవుండే ఖుష్బూ గురించి తెలిసింది. వెంటనే ఇమ్రాన్​ తల్లి.. ఖుష్బూ కుటుంబసభ్యులతో మాట్లాడింది. వారు కూడా పెళ్లికి అంగీకరించారు. ఆదివారం జరిగే పెళ్లి కోసం ఇమ్రాన్​ను అతని కుటుంబసభ్యులు తలపాగాతో పాటుగా.. నోట్ల దండ వేసి వరుడిగా ముస్తాబు చేశారు. ఆదివారం ఇరువురి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details