కేటీఆర్‌పై మూడో తరగతి చిన్నారి అభిమానం.. సీడ్‌బాల్స్‌తో బర్త్‌డే విషెస్.. - third classs student wishes to ktr
KTR BIRTHDAY WISHES: మంత్రి కేటీఆర్ జన్మదిన దినం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన చిన్నారి బ్లేస్సి సీతాఫలం విత్తన బంతులతో విభిన్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. కేటీఆర్‌పై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. తెలంగాణ హారిత హరంలో సిద్ధం చేస్తున్న సీతాఫలం విత్తనాలు, విత్తన బంతులతో "హ్యాపీ బర్త్ డే కేటిఆర్ సార్" అంటూ సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పింది. బ్లేస్సీ ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST