షో రూంలో దొంగతనం - లాకర్ బరువుందని చెత్తలో వదిలేసిన దొంగలు - theifs theft huge amount in car showroom
Published : Nov 14, 2023, 9:56 PM IST
Thieves Theft Huge Amount in Car Showroom :సులభంగా దొంగతనం చేసి ఆర్థికంగా లాభపడదామనుకున్నారు పలువురు దొంగలు. దాని కోసం ఎప్పటి నుంచో వ్యూహాలు రచించారు. సమయం చూసుకొని ఓ కార్ షో రూమ్‌లో చోరీకి పాల్పడ్డారు. ఆ సమయంలోనే షో రూమ్ లాకర్‌ను కూడా చోరీ చేశారు. అది కాస్త బరువుండడంతో చెత్తకూప్పలో వదిలేశారు. కానీ వాళ్లకు తెలియదు అందులోనే డబ్బులున్నాయని.
అసలేం జరిగిదంటే నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ శివారులోని మహేంద్ర షో రూమ్‌లో రాత్రి చోరీ జరిగింది. షో రూమ్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి షో రూమ్ వెనుక నుంచి వచ్చిన దొంగలు డెస్క్‌లో ఉన్న రూ.60 వేలు, 3 సెల్ ఫోన్లు చోరీ చేశారు. లాకర్ పెట్టెను తీసుకోపోయే ప్రయత్నంలో అది అధిక బరువు ఉండటంతో దాన్ని చెత్తకుప్పలోనే వదిలి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు చెత్త కుప్పలో లాకర్‌ను గుర్తించారు. దానిలో రూ.5 లక్షలు అలాగే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాపం దొంగలు అసలు డబ్బు వదిలేసి చిల్లర తీసుకెళ్లారు.
TAGGED:
మహేందర్ షో రూమ్‌లో చోరీ