Gold Thefts In Nizamabad : షాప్‌కి వెళ్లొచ్చేసరికి.. 16 తులాల బంగారం, రూ.1.85 లక్షలు చోరీ - 1 85 లక్షల నగదు 16 తులాల బంగారం చోరీ
Thieves Who Stole Gold And Cash : ఓ వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి నగదు, బంగారాన్ని తీసుకొని వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి వాటిని ఎత్తుకుపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ చోరీలో 16 తులాల బంగారం, రూ.1.85 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయారు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని శంకర్ నగర్‌కు చెందిన సయ్యద్ 16 తులాల బంగారం, రూ.1.85 లక్షల నగుదును తన బైక్‌లో పెట్టుకొని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఓ షాపులో పని ఉండడంతో.. అక్కడికి వెళ్లాడు. అతనిని గమనించుకుంటూ ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఇదే అవకాశం అని భావించి.. బ్యాగ్‌ను దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది. దాని ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.