LIVE VIDEO : మహిళ మెడలో నుంచి చైన్ లాగేందుకు ప్రయత్నం.. కానీ..! - తెలుగు తాజా
chain snatching in cc footage: ఇంటి బయట తన బాబుకు అన్నం తినిపిస్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాగేందుకు ఓ దొంగ ప్రయత్నించిన ఘటన.. నంద్యాలలో జరిగింది. ఒక్కసారిగా మెడలోంచి గొలుసు లాగే సరికి బాబుతో సహా మహిళ కింద పడిపోయింది. అయినా, గొలుసును లాగడానికి ప్రయత్నించడంతో ఆమె గట్టిగా అరిచింది. దీంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. నంద్యాల బైర్మల్ వీధిలో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST