Thief Hanging From Train Viral Video : మహిళ పర్సు చోరీ.. దొంగను కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు.. తర్వాత స్టేషన్లో.. - దొంగను రైలు కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు
Published : Sep 3, 2023, 12:37 PM IST
Thief Hanging From Train Viral Video :రైలులో ప్రయాణిస్తున్న మహిళ పర్సును చోరీ చేసిన ఓ దొంగను కిటికీకి వేలాడదీశారు ప్రయాణికులు. రైలు తర్వాత స్టేషన్‌కు చేరుకున్నాక.. దొంగను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు అప్పగించారు. అయితే రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లోని బెగూసరాయ్‌లో కటిహార్ నుంచి సమస్తిపుర్ వెళ్తున్న రైలులో జరిగింది.
అసలేం జరిగిందంటే?
Hanging Thief In Train :శనివారం.. కటిహార్ నుంచి సమస్తిపుర్ వెళ్తున్న రైలులో ఉన్న మహిళ పర్సును ఓ యువకుడు చోరీ చేశాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు.. అతడిని పట్టుకుని వేలాడదీశారు. పడిపోకుండా ఉండేందుకు అతడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలానే అతడిని వేలాడదీసి.. బచ్వారా జంక్షన్ రైల్వే స్టేషన్ కానిస్టేబుల్‌కు అతడిని అప్పగించారు. దొంగను హేమంత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని విచారించి విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.