Thief Attack on Woman In Vemulawada : అట్లుంటది మరి ఆడవాళ్లతో పెట్టుకుంటే.. భయంతో పరుగులు తీసిన దొంగ - Telangana Crime News Today
Thief Attack on Woman In Vemulawada : ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చపోతున్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందిన కాడికి దోచుకుని పోదామనుకుంటున్నారు. ఇన్నాళ్లు శివారు ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోయేవారు.. అయితే తాజాగా వారు కూడా ట్రెండ్ మార్చి ఇళ్లపై విరుచుకుపడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ దుండగుడు మహిళ మెడలో నుంచి నగలు అపహరించేందుకు ప్రయత్నించాడు.
ఆమె ధైర్యంగా ప్రతిఘటించడంతో చేతికి చిక్కిన 7 గ్రాముల చైన్‌తో ఆగంతకుడు పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వేములవాడ పట్టణంలోని భగవంత రావు నగర్లో వేకువ జామున పిల్లి శ్రీలత ఇంటి ఆవరణలో చీకట్లో నక్కిన ఆగంతకుడు దాడికి యత్నించాడు. దొంగ నుంచి తప్పించుకొని ధైర్యంగా ఆమె ప్రతిఘటించారు. పెనుగులాటలో ఏడు గ్రాముల బంగారు చైన్ దుండగుడు లాకెళ్లాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.