ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - ఏపీ తాజా వార్తలు
THEFT IN TEMPLE: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున గుడిలోకి ప్రవేశించిన ముగ్గురు గుర్తు తెలియని యువకులు.. ఏకంగా హుండీనే ఎత్తుకెళ్లారు. అనంతరం అందులోని డబ్బులు తీసుకుని.. హుండీని సమీపంలోని పొలాల్లో వదిలేసి వెళ్లిపోయారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST