12 సెకన్లలో రూ.1.25 లక్షలు విలువైన బంగారు గొలుసు చోరీ - Video of a woman stole gold from a gold shop
ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఓ నగల దుకాణంలో రూ.1.25 లక్షలు విలువైన బంగారు గొలుసు చోరీకి గురైంది. శనివారం నగల షాప్‌కు భార్యాభర్తల్లా వచ్చిన ఇద్దరిలో ఓ మహిళ 12 సెకన్లలో బంగారు గొలుసును దొంగిలించింది. షాప్‌కు వచ్చిన వెంటనే బంగారు గొలుసులు చూపించమన్న ఆ ఇద్దరు.. సేల్స్‌మ్యాన్ దృష్టి మరల్చి చోరీకి పాల్పడ్డారు. వారిద్దరూ షాప్ నుంచి వెళ్లిన తర్వాత సిబ్బంది ఆభరణాలను లెక్కించారు. అయితే వాటిలో ఓ బంగారు గొలుసు తక్కువగా ఉంది. దీంతో షోరూమ్‌లో అమర్చిన సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో నగల దుకాణం యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.