తెలంగాణ

telangana

Theft At a Liquor Store in Khammam District

ETV Bharat / videos

ముఖానికి మాస్కు వేసి.. చిల్లరంత మూటగట్టి.. దుమ్ముకొట్టె కళ్లలోన.. దొంగ దొంగ - సీసీ ఫుటేజీ దశ్యాలు

By

Published : Apr 11, 2023, 12:58 PM IST

Theft At a Liquor Store in Khammam District:  సాధారణంగా దొంగలు ఇళ్లల్లో లేదా బ్యాంకుల్లో దొంగతనానికి వస్తారు. కానీ, ఈ దొంగ.. మద్యం దుకాణంలో చోరీ చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ఏన్కూరులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏన్కూర్​ మద్యం దుకాణంలో నిన్న అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి వైన్ షాపులోకి చొరబడి మద్యం బాటిళ్లను చోరీ చేశాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొంతమంది కారులో వచ్చారు. అందులో ఒక వ్యక్తి కారు దిగి వైన్ షాపు తలుపులు పగులగొట్టాడు. అనంతరం ఆ దుకాణంలో ఉన్న మద్యం సీసాలు, కొంత నగదును ఎత్తుకెళ్లాడు. 

షాపు లోపలికి వచ్చిన దొంగలు ముఖానికి మాస్క్ ధరించి దొంగతనం చేశాడు. సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డాడు. ఇవాళ ఉదయం షాపు యజమాని తలుపులు తెరిచి చూసేసరికి లోపల వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని గమనించిన పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. సీసీ టీవీ దృశ్యాలు ఆధారంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details