ఘనంగా రెండో రోజు ఫార్ములా-ఈ రేసింగ్.. సందడి చేసిన ప్రేక్షకులు - రెండో రోజు ఫార్ములా ఈ రేసింగ్‌లో సందడి
the second day of Formula e racing in Hyderabad: హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ నగరంలో అట్టహసంగా ప్రారంభమైంది. నగరంలో జరుగుతున్న ఫార్ములా-ఈ రేస్ సందడిగా సాగుతోంది. రెండో రోజు జరుగుతున్న అర్హత రేస్‌ను వీక్షించడానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ప్రీ ప్రాక్టీస్ రేస్ అనంతరం రేస్ డ్రైవర్లను కలిసి ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు ప్రేక్షకుల కోసం ఇంటరాక్టివ్ సెషన్‌ను ఏర్పాటు చేశారు. తమ అభిమాన డ్రైవర్లతో స్వీయచిత్రాలు, ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు వందల సంఖ్యలో బారులు తీరారు. నగరంలో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ ఫార్ములా రేసును చూసేందుకు అభిమానుల వచ్చి ఆనందిస్తున్నారు.
రేస్‌లో పాల్గొంటున్న డ్రైవర్లతో ప్రేక్షకులు సరదాాగా స్వీయ చిత్రాలను తీసుకొని రేసింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రేసింగ్ భారతదేశంలో మెదటిసారి అయినందున వేర్వేరు ప్రాంతాల నుంచి అభిమానులు వస్తున్నారు. ఈరోజు ఉదయ 8 గంటలకే ప్రీ ప్రాక్టీసు, తర్వాత క్వాలిఫయింగ్...అనంతరం 3 గంటల తర్వాత ప్రధాన రేస్‌కు డ్రైవర్లు రంగంలోకి దిగనున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ రేస్ సాగనుంది.
ప్రేక్షకులు అతిథులకు సేవలందిం చేందుకు ఎంబీఏ చదువుతున్న విద్యార్థులను వాలంటీర్లుగా ఎంపిక చేశారు. నేడు జరిగే పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రికెట్, సినిమా తారలు ఇతర సెలబ్రెటీలు హాజరు కానున్నారు. పోటీలు జరిగే ప్రాంతానికి రావాలంటే పాస్ లేదంటే టిక్కెట్ తప్పనిసరి. అంతర్జాతీయ పోటీలు కావడంతో భద్రత పరంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి ప్రేక్షకులను విడిచిపెట్టే ముందు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.