ఆకట్టుకున్న ది లెజెండ్ ఆఫ్ జ్యోతిర్లింగ ప్రదర్శన - హైదరాబాద్‌లో ద లెజెండ్ ఆఫ్ జ్యోతిర్లింగ ప్రదర్శన
The Legend of Jyotirlinga performance దేశంలోని 12 జ్యోతిర్లింగాలు వాటి అద్భుతమైన చరిత్రను తెలుపుతూ ఏర్పాటుచేసిన 'ది లెజెండ్ ఆఫ్ జ్యోతిర్లింగ' పేరిట జాతీయస్థాయి భరతనాట్యం కార్యక్రమానికి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ వేదికైంది. కేంద్ర ప్రభుత్వం, సాంస్కృతిక పర్యాటక శాఖ సంయుక్తంగా ఆ భరతనాట్య కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిసారిగా జరిపారు. ఆ కార్యక్రమంలో 40ఏళ్ల అనుభవం కలిగిన జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత సునయన నాట్యబృందం అధినేత శ్రీమతి కనకా సుధాకర్ నాయకత్వంలో 22 మంది కళాబృందం ప్రతిభ కనబరిచి అబ్బురపరిచారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST