తెలంగాణ

telangana

strike

ETV Bharat / videos

The Kerala story movie row in Nirmal : భైంసాలో వివాదాస్పదంగా మారిన 'ది కేరళ స్టోరీ' - తెలంగాణ వార్తలు

By

Published : May 12, 2023, 4:55 PM IST

The Kerala Story Movie row In Nirmal : వివాదాలతో రిలీజైనా ది కేరళ స్టోరీ సినిమా రాష్ట్రంలో ఎలాంటి వివాదాలు లేకుండా నడుస్తోంది. కానీ భైంసా కమల థియేటర్​లో మాత్రం వివాదాస్పదంగా మారింది. ఉదయం షో వేయాల్సింది ఉండగా షో వేయకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు. కాగా ఈ సినిమాకి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా ఉంటుంటే కొన్ని విమర్శిస్తున్నాయి. నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని కమల థియేటర్​లో 'ది కేరళ స్టోరీ' షో ఉదయం వేయాల్సింది ఉండగా షో వేయకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు. సినిమా చూడటానికి వస్తున్న వీక్షకులను పట్టణ సీఐ ఆద్వర్యంలో అడ్డుకుంటున్నారు. షో ఎందుకు వేయడం లేదంటూ బీజేపీ, హిందువాహిని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ధర్నా చేపట్టారు. సినిమాను నిలిపివేయడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో  సీఐకి, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే షో ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details