Groom Died: పెళ్లింట విషాదం..పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు డాబాపై నుండి పడి మృతి
Groom Died: విజయనగరం జిల్లా రాజాంలో ఒక పెళ్లిఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు ప్రమాదవశాత్తు డాబాపై నుండి జారిపడి మృతి చెందాడు. దీంతో రాజాం పట్టణంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం బుధవారం రాత్రి రాజాం సూర్య దుర్గ కళ్యాణ మండపంలో రాత్రి 12:55 నిమిషాలకు వజ్జిపర్తి సూర్యరావు అనే యువకుడికి వివాహం జరగవలసి ఉన్నది. నవ వరుడు సూర్యారావు రాత్రి డాబాపై పడుకుండగా ప్రమాదవసత్తు తెల్లవారి జామున పైనుంచి నిద్రమత్తులో డాబాపై నుండి క్రిందకు పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బంధువులు రాజాం ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతూ వరుడు మృతి చెందాడు. పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు అదే రోజు మృతిచెందడంతో పెళ్లింట్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వీరి స్వగ్రామం బలిజిపేట మండలం పెద్దపంకి గ్రామం వీరి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా రాజంలో నూడుల్స్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారని స్థానికులు తెలిపారు.