తెలంగాణ

telangana

ది గ్రేటి ఇండియన్ ఐస్ క్రీం టేస్టింగ్ ఛాలెంజ్

ETV Bharat / videos

Ice Cream Tasting Challenge in Hyderabad : ఈనెల 18న హైదరాబాద్​లో ఐస్​క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ - telangana latest news

By

Published : Jun 14, 2023, 12:53 PM IST

Ice Cream Tasting Challenge in Hyderabad  : 'ది గ్రేట్ ఇండియన్ ఐస్​క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్-2023' హైదరాబాద్ వాసులను అలరించనుంది. ఈ నెల 18న హైటెక్  సిటీలోని  మైదాన్ ఎక్స్ పో సెంటర్ వేదికగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు విజయ డెయిరీ ఛైర్మన్ సోమ భరత్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించిన సమావేశంలో కొర్రమీను సినిమా నటి కిశోరి, హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు రాజగోపాల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలో విజయ డెయిరీ తరఫున కొత్తగా ఐస్ క్రీమ్​లను అందుబాటులోకి తేనున్నట్లు సోమ భరత్ తెలిపారు. గ్రేట్ ఇండియన్ ఐస్​క్రీమ్  టేస్టింగ్ ఛాలెంజ్​లో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని ఎక్కువ సంఖ్యలో ఐస్ క్రీమ్ ఫ్లేవర్లను గుర్తించిన వారికి నగదు బహుమతులు అందించనున్నట్టు వివరించారు. బుక్ మై షో, మేరా ఈవెంట్స్, పేటీఎం ఇన్ సైడర్ ద్వారా ఈ పోటీల టికెట్​లను కొనుగోలు చేసుకోవచ్చని భరత్ వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details