pratidwani : కుల గణన.. కొత్త డిమాండ్లు.. స్వరం పెంచిన విపక్షాలు - Congress leader Rahul Gandhi
pratidwani : కుల గణనపై కొత్త డిమాండ్లు తెరమీదికి వస్తున్నాయి. అట్టడుగు వర్గాలకు 50శాతానికి మించి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశంలో మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.. కులాలవారీ జనగణన డిమాండ్. స్వరం పెంచిన విపక్షాలు... ప్రధానమంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. అట్టడుగువర్గాల వారికి అవకాశాల కోసం అవసరమైతే 50% పరిమితిని తొలగించి మరీ కోటా పెంచే దిశగా చర్యలు చేపట్టాలని పిలుపు నిచ్చారు... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ విషయంపై ఓబీసీ వర్గాలైతే ఎంతోకాలంగా పోరాటం చేస్తునే ఉన్నాయి. కేంద్రమైతే దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకాలం కులగణన చేపట్టక పోవటానికి కారణాలు ఏంటి? ఈ డిమాండ్‌కు ఎక్కడ బీజం పడింది? కేంద్రం ఆలోచనా ధోరణి ఎలా ఉంది? కులగణన చేపడితే ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.