తెలంగాణ

telangana

Thatikonda Rajaiah Crying for MLA Ticket

ETV Bharat / videos

Thatikonda Rajaiah Crying for MLA Ticket : కార్యకర్తల ముందే బోరున విలపించిన MLA రాజయ్య.. వీడియో వైరల్ - Warangal district latest news

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2023, 5:21 PM IST

Thatikonda Rajaiah Crying for MLA Ticket : జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన్‌పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ నిరాకరించి.. అభ్యర్ధిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి (Kadiyam Srihari) బీఆర్​ఎస్​ అవకాశం కల్పించింది. సోమవారం హైదరాబాద్​లో ఉన్న రాజయ్య.. నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. 

వచ్చీ రాగానే కార్యకర్తలను చూసి తీవ్ర రాజయ్య(MLA Thatikonda Rajaiah) భావోద్వేగానికి గురైయ్యారు. తమ నేత భావోద్వేగాన్ని చూసి ఆయన అనుచరులు సైతం పలువురు కంట తడిపెట్టారు. ఇప్పుడున్న స్థాయికి తగ్గకుండా తనకు మంచి అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని రాజయ్య తెలిపారు. అధినాయకుడు మాటే శిరోధార్యమని.. కేసీఆర్​ నాయకత్వంలో సైనికుల్లాగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంకా కొన్ని పనులున్నాయని అవి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 16న జరిగే సింహగర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఉండడమే తనకిష్టమంటూ రాజయ్య బోరున విలపించారు.

ABOUT THE AUTHOR

...view details