తెలంగాణ

telangana

తలసాని

ETV Bharat / videos

Talasani Holi celebrations: మనువడితో తలసాని హోలీ సంబురం - Holi celebrations in Hyderabad

By

Published : Mar 7, 2023, 5:07 PM IST

Thalasani Srinivasyadav celebrated Holi festival: హోలీ పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంలో మునిగిపోతారు. చిన్నాపెద్దా తేడా తెలియకుండా రంగులను చల్లుకుంటారు. రంగులమయంతో ప్రతి ఊరూ-వాడా కళకళలాడిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.హోలీ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనువడు తారక్​తో హోలీ ఆడుతూ సందడిగా గడిపారు. 

వెస్ట్​ మారేడ్​పల్లిలోని ఆయన నివాసంలో తాత మనువడు ఇద్దరు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడు ప్రజా జీవితంలో బిజీగా ఉండే మంత్రి హొలీ సందర్భంగా మనవడితో ఎంతో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకగా నిలిచే పండుగలను విశ్వవ్యాప్తం చేయాలని తలసాని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details