Thalasani Dance At Lashkar Bonalu : సందడిగా ముగిసిన బోనాల పండుగ.. మంత్రి తలసాని డ్యాన్స్ చూస్తారా..!
Ujjain Mahankali Bonalu festival 2023 : తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచే బోనాల ఉత్సవాలు రాష్టవ్యాప్తంగా ఉత్సహంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. బోనాల విశిష్టతను ఆమెకు వివరించారు. అనంతరం మాట్లాడిన తమిళిసై.. తాను ఎల్లమ్మ తల్లి భక్తురాలినని చెప్పుకొచ్చారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆకాంక్షించారు.
ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా.. ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. దీనిని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. మొండా మార్కెట్ నుంచి ఆదయ్యనగర్ కమాన్ మీదుగా మహంకాళి అమ్మవారి ఆలయం వరకు ఫలహారం ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. వివిధ కళాకారులు, పోతురాజుల నృత్యాలతో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కళాకారులతో కలిసి మంత్రి తలసాని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పోతురాజులతో కలిసి ఆయన పాదం కదిపారు.