తెలంగాణ

telangana

Road Accident at Thadikal in Karimnagar

ETV Bharat / videos

Thadikal Road Accident Today : ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ.. పలువురికి గాయాలు.. డ్రైవర్​ చాకచక్యంతో తప్పిన పెనుప్రమాదం! - Road accident in Karimnagar district

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 1:38 PM IST

Thadikal Road Accident Todayin Karimnagar : కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంకరపట్నం మండలం తడికల్‌ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వరంగల్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Road Accidents in Telangana :ఘటన చోటు చేసుకున్న సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. వెంటనే 108కి ఫోన్​ చేసి గాయపడ్డవారిని.. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాద కారణాలను పరిశీలించారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. బస్సు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించటంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details