Tent on Car in Warangal Viral Video : ఐడియా అదిరింది బాసూ.. ఈ 'కారు'వ్యాన్ చూస్తే 'ఇదేందయ్యా ఇది' అనాల్సిందే..! - Viral video of a house in a car in Warangal
Published : Sep 3, 2023, 3:16 PM IST
Tent on Car in Warangal Viral Video : కుటుంబంతో కలిసి ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే.. వెళ్లిన చోట సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు, దూర ప్రయాణం చేసేటప్పుడు అలసిపోయి సేదతీరే వసతులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వరంగల్‌కు చెందిన ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచన చేశాడు.
House on Wheels in Warangal Viral Video: వరంగల్‌కు చెందిన ఆనంద్ అనే వ్యాపారి.. తన విద్యుత్ కారులో అనేక వసతులు ఏర్పాటు చేసుకున్నారు. పుణే నుంచి రూ.1 లక్ష వ్యయంతో తెప్పించిన గుడారం పెట్టెను.. కారు పైభాగంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన చోట సూట్‌కేస్ మాదిరి తెరిస్తే.. పది నిమిషాల వ్యవధిలోనే గుడారం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో ముగ్గురు నిద్ర పోయేలా స్థలంతో పాటు కారు పక్కన స్నానం చేసేందుకు, విశ్రాంతికి సైతం గుడారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నీటి కోసం ఇబ్బంది పడకుండా ట్యాంకు బిగించుకున్నారు. కారు లోపల విలాసవంతమైన సీట్లు, ఎల్ఈడీ టీవీ, రెండు ఫ్యాన్లు, చిన్నపాటి ఫ్రిజ్‌తో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు.