తెలంగాణ

telangana

ysrcp leaders attack on tdp leaders

ETV Bharat / videos

YSRCP Leaders Attack On TDP Leaders : తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు.. అంగళ్లులో ఉద్రిక్తత

By

Published : Aug 4, 2023, 4:58 PM IST

YSRCP Leaders Attack on TDP Leaders at Annamaiya District : ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా.. తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. బ్యానర్లు చించివేస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే సమయంలో ఘర్షణ మొదలైంది. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు.. చెదరగొడుతున్నా వాళ్లెదురుగానే వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఈ దాడిలో.. మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంగళ్లు గ్రామానికి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గాయపడిన కార్యకర్తలకు చికిత్స చేయించాలని సూచించారు. 'ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు.. ఈ రావణాసురుడికి ఎమ్మెల్యే ట్యాగ్‌' ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 'నేను పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని.. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా.. ధైర్యం ఉంటే రండి చూసుకుందాం' అంటూ చంద్రబాబు సవాల్​ విసిరారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details