Telugu People Protest Against CBN Arrest in America చంద్రబాబు ఆరెస్టుపై అగ్రరాజ్యంలో ఆందోళనలు.. డల్లాస్, వాషింగ్టన్ పురవీధుల్లో తెలుగు ప్రజల ర్యాలీలు - చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు
Published : Sep 17, 2023, 11:10 AM IST
|Updated : Sep 17, 2023, 11:20 AM IST
Telugu People Protest Against CBN Arrest in America: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే కాకుండా.. ఖండతరాలను సైతం దాటిన ఈ నిరసన సెగ భగ్గుమంటోంది. అమెరికాలో టీడీపీ అధినేత అరెస్టుపై తెలుగు ప్రజలు ఆందోళన బాటపట్టారు. టీడీపీ శ్రేణులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దుతుగా నిలుస్తున్నారు.
డల్లాస్, వాషింగ్టన్, అమెరికాలోని ఇతర నగరాలు, పట్టణాల్లో చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. 'న్యాయం కావాలి - చంద్రబాబు విడుదల కావాలి' అనే నినాదాలతో డల్లాస్ వీధులను మారుమోగించారు. అంతేకాకుండా నల్ల దుస్తులు ధరించి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు వాషింగ్టన్లో సైతం తెలుగు ప్రజలు చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ పెద్ద ఎత్తున తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆందోళనతో అక్కడి వీధులు దద్దరిల్లాయి.