Dance in Mahashakthi:"సైకో పోవాలి.. సైకిల్ రావాలి".. మహాశక్తిలో దుమ్ములేపిన తెలుగు మహిళలు.. వీడియో వైరల్ - సైకో పోవాలి సైకిల్ రావాలి
Telugu Mahilalu Dance in Mahashakthi: మహాశక్తి ద్వారా మహిళల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చాటుతామని తెలుగు మహిళలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య కార్యక్రమం నిర్వహించారు. మహానాడులో టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మేనిఫెస్టోలో మహిళల కోసం మహాశక్తి పథకాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే 'మహాశక్తి'పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మహాశక్తి ప్రచార వాహనాలను కూడా చంద్రబాబు ప్రారంభించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే మేనిఫెస్టోలో మహిళల కోసం పొందుపర్చిన ప్రతి అంశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా ప్రచార వాహనాలను సిద్ధం చేశారు. కాగా ఈ సమావేశంలో తెలుగు మహిళలు డ్యాన్స్‌తో దుమ్ములేపారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' పాటకు తమదైన స్టైల్లో వేసి కార్యక్రమానికి మరింత ఊపు తెచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ డ్యాన్స్ చూసేయండి.