Prathidwani : సంక్షేమ వసతి గృహాలు.. సమస్యలు - తెలంగాణ న్యూస్
Prathidwani on Social Welfare Hostels in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలు ప్రారంభమై 22 రోజులవుతోంది. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఒక్క విద్యార్థి కూడా హాస్టల్లో చేరలేదు. కొన్నిచోట్ల పిల్లలు వస్తున్నప్పటికీ హెచ్ఎంలు చేర్చుకోలేదు. కొద్ది రోజులు ఆగి రండి అని చెబుతున్నారు. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన భోజన బిల్లులు ఇంకా రాలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు మెస్ ఛార్జీలు విడుదల చేయకపోవడంతో పిల్లలకు భోజనం పెట్టలేమని వసతి గృహ నిర్వాహకులు చెబుతున్నారు.
సెలవుల్లో మూసి ఉంచిన హాస్టళ్లు శుభ్రం చేయడంతో పాటు ఇతర సమస్యలన్నీ పరిష్కారించాలి. మరి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న వేలాది సంక్షేమ వసతి గృహాల్లో ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? మెస్‌ఛార్జీల పెంపు, కాస్మోటిక్స్ అలవెన్స్‌లు.. ఇతర డిమాండ్ల పరిష్కారం ఎంత వరకు వచ్చింది? గత సంవత్సరం పెండింగ్ బిల్లులన్ని యాజమాన్యానికి అందాయా? పారిశుద్ధ్య పరిస్థితులు, ఫుడ్ పాయిజనింగ్, పాముకాట్లు వంటి ఘటనలపై గతేడాది ఫిర్యాదుల నుంచి ఎంత వరకు పాఠాలు నేర్చుకున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.