PM Fellowship: పాలీకల్చర్‌లో పరిశోధనలు.. వరించిన పీఎం ఫెలోషిప్ - తెలంగాణ తాజా వార్తలు
Telangana Student gets PM Fellowship: సామాన్యంగా డాక్టరేట్ చెయ్యడమంటేనే చాలా కష్టం. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయాలి, అర్హత సాధించాలి. వచ్చే స్కాలరిషిప్తో పరిశోధన చెయ్యాలి. అలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఫెలోషిప్ ద్వారా ఆర్థికంగా పరిశోధన చేసే విద్యార్థులకు చేయూతనందిస్తుంది. ఈ ఫెలోషిప్ పొందాలంటే దానికి ప్రవేశ పరీక్ష రాయాలి. ఈ పరీక్షను ఏటా లక్ష మందికి పైగా రాస్తే అది మాత్రం 100 మందికే వస్తుంది. దానికి అంత విలువ అన్న మాట. ఈ అవకాశాన్ని దక్కించుకోవాలంటే ఆ పోటీని దాటుకునేంత కష్టపడాలి. అప్పుడే కానీ ఆ అవకాశం చేజిక్కదు.
ఆ కోవకు చెందిందే ఈ యువతి.. నాగర్‌కర్నూల్ జిల్లా రంగాపూర్ గ్రామానికి చెందిన మల్‌రెడ్డి జ్యోత్స్న. పాలీకల్చర్‌లో తన పరిశోధనతో రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఆ యువతి పని చేస్తోంది. అందులో భాగంగా ప్రతిష్ఠాత్మక పీఎం ఫెలోషిప్ ఆమెను వరించింది. అసలు.. ఈ పాలీకల్చర్ అంటే ఏమిటి..? తన పరిశోధన ఫలితాలు రైతులకు ఎలా మేలు చేయనున్నాయి..? ఆమె మాటల్లోనే విందాం..