Telangana RTC Special Buses for Women : టీఎస్ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్.. ఆ రూట్లో మహిళల కోసం ప్రత్యేక బస్సు - తెలంగాణ తాజా వార్తలు
Published : Sep 21, 2023, 4:56 PM IST
Telangana RTC Special Buses for Women :హైదరాబాద్‌లో టీఎస్ఆర్టీసీ నడుపుతున్న మహిళా ప్రత్యేక బస్సులకు(TSRTC Special Buses for Women) విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ మహిళల సౌకర్యార్థం మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు రూట్లలో ఈ బస్సులు తమ సేవలను అందిస్తుండగా.. ఇవాళ సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు మరో బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సు ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు బయలు దేరి.. తిరిగి సాయంత్రం 4.10 గంటలకు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రానునట్లు ఆర్టీసీ అధికారులు( TSRTC Officials) తెలిపారు.
RTC Special Buses for Women in Telangana :రద్దీగా ఉండే రూట్లలో మహిళల ప్రయాణం సాఫీగా సాగటానికి.. సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకోటానికి వీలుగా ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మహిళలకు ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేయటం ద్వారా ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుందని, మరిన్ని బస్సులు వేసి.. సమయాలను పెంచితే బాగుంటుందని మహిళా ప్రయాణికులు చెబుతున్నారు.